ది ప్యారడైజ్ : ‘ఆయా షేర్’ సాంగ్‌కు డేట్ ఫిక్స్.. బాక్సులు బద్దలవ్వాల్సిందే..!

The Paradise

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ (The Paradise)చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా నుండి వస్తున్న అప్‌డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని తొలుత మార్చి 26, 2026న విడుదల చేయాలని భావించినా షూటింగ్ ఆలస్యం కారణంగా ఇప్పుడు ఆగస్టు 21, 2026కి వాయిదా పడింది.

ఇక ఈ మూవీ రిలీజ్ ఆలస్యమవడంతో నిరాశలో ఉన్న అభిమానులను ఉత్సాహపరిచేందుకు చిత్ర యూనిట్ ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘ఆయా షేర్’ను ఫిబ్రవరి 24న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో ఈ పాటపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ నిర్మిస్తోంది.

Exit mobile version