పూరి ఆకాష్ ‘ఆంధ్రాపోరి’ షూటింగ్ పూర్తి..!

andhra-pori
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్‌ పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతున్న ‘ఆంధ్రాపోరి’ షూటింగ్ పూర్తైంది. గతంలో పలు చిత్రాల్లో హీరో చిన్నప్పటి వేషాల్లో మెరిసిన ఆకాష్, ధోనీ సినిమాలో పూర్తి స్థాయి పాత్రతో అలరించారు. ఇక తాజాగా మరాఠీలో విజయవంతమైన ‘టైమ్‌పాస్‌’ తెలుగు రీమేక్‌లో ఆకాష్ హీరోగా నటిస్తున్నారు.

టీనేజ్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన ఉల్కా గుప్తా నటిస్తున్నారు. 32 రోజుల పాటు నిరంతరాయంగా జరిగిన షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. జనవరి నెలాఖర్లో ఖమ్మం జిల్లా పాల్వంచలో మొదలైన ఈ షెడ్యూల్ నిన్నటితో ముగిసింది.

ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మితమవుతున్న ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని ఈ వేసవిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version