ఈ నెల 27కు వాయిదా పడిన ధనుష్ ‘అనేకుడు’.

anekudu
ధనుష్, అమైరా దస్తూర్ జంటగా నటించిన తమిళ సినిమా ‘అనేగన్’. కెవి ఆనంద్ దర్శకుడు. తెలుగు ఈ సినిమాను ‘అనేకుడు’ పేరుతో అనువదిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఫిబ్రవరి 20వ తేదిన విడుదల చేయాలని భావించారు. సినిమా విడుదల ఒక వారం రోజులు వాయిదా పడింది. ఈ నెల 27న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

డిఫరెంట్ స్క్రీన్‌ ప్లేతో కొనసాగే రొమాంటిక్‌ లవ్‌ స్టోరీ ఇది. ధనుష్ అద్బుతంగా నటించాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకుంటుంది అనే దర్శకుడు కెవి ఆనంద్ అన్నారు.

ఇటివల ఈ సినిమా తమిళ వెర్షన్ విడుదలై మంచి విజయం సాధించింది. హారిస్ జయరాజ్ అందించిన ఆడియోకి తెలుగులో మంచి స్పందన లభించింది. ఎజిఎస్‌ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కల్పాత్తి ఎస్‌. అఘోరం సమర్పణలో కల్పాత్తి. ఎస్‌. గణేష్‌, కల్పాత్తి. ఎస్‌. సురేష్‌ లు సినిమాను నిర్మించారు.

Exit mobile version