ఇంటర్వ్యూ : హీరో కార్తీ – ‘దొంగ’ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ !

ఇంటర్వ్యూ : హీరో కార్తీ – ‘దొంగ’ ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ !

Published on Dec 15, 2019 2:39 PM IST

‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ చిత్రంలో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హీరో కార్తీ విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…
 

‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ‘దొంగ’ వస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి ?

అంచనాలు మరీ ఎక్కువైతే డేంజర్ అండి. అయితే సినిమా చేసేటప్పుడు అవ్వన్నీ నేను ఆలోచించను. నాకు సినిమా నచ్చితేనే చేస్తాను. అందుకే 13 సంవత్సరాలు అవుతున్నా కేవలం 19 సినిమాలే చేశాను. ప్రతి సినిమా విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటాను.
 

మరి ఈ ‘దొంగ’ సినిమాలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి ?

ఫస్ట్ స్క్రిప్టే అండి. లైన్ విన్నప్పుడే బాగా కనెక్ట్ అయింది. ఆ తరువాత రెండు పేజీల కథ చెప్పారు. అప్పుడు అక్క క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. వదిన జ్యోతికకు కూడా ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం.
 

ఈ సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చింది. ఈ సినిమా నుండి ప్రేక్షుకులు ఏమి ఆశించొచ్చు ?

ఈ సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. డీసెంట్ కామెడీ ఉంటుంది, సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ తో పాటు సప్సెన్స్ ఉంటుంది. దృశ్యం డైరెక్టరే ఈ సినిమానికి డైరెక్టర్ కాబట్టి అతని డైరెక్షన్ స్కిల్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ కానున్నాయి.

 

సినిమాలో మీ రోల్ గురించి ?

సినిమా టైటిల్ లోనే రివీల్ చేసినట్లు సినిమాలో కూడా నేను దొంగనే. అలాంటి వ్యక్తి ఎలా మారాడు. ఈ మధ్యలో అతని జర్నీ ఎలా సాగింది అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది.

 

మొదటిసారి మీ వదిన జ్యోతికగారితో కలిసి నటించడం ఎలా అనిపించింది ?

కొత్తగా ఏమి అనిపించలేదండి. రెగ్యులర్ గా ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నట్లే ఉండేది. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా అలాంటివే. అయితే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ గ్రేట్. పైగా ఆవిడది స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే ఫాదర్ రోల్ లో నటించిన సత్యరాజ్ గారిది కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాంటి ఆర్టిస్ట్ ల పక్కన చేయటం బాగా అనిపించింది.

 

సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని విన్నాం ?

అవును.. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవి సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయి. ఒక విధంగా ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు.
 

మీ తదుపరి సినిమా గురించి ?

ప్రస్తుతం ఒక సినిమా జరుగుతుంది, ఆల్ రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు