సూపర్ స్టార్ మహేష్ పై అనిల్ కపూర్ కామెంట్స్!

సూపర్ స్టార్ మహేష్ పై అనిల్ కపూర్ కామెంట్స్!

Published on Nov 29, 2023 3:51 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు తెలుగు సూపర్‌ స్టార్‌ కి ఫ్యాన్ అని తెలిపారు. మహేష్ బాబు నటించిన చాలా సినిమాలు హిందీలో కూడా రీమేక్ అయ్యాయి. ఇప్పుడు బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ మహేష్ ని ఆకాశానికి ఎత్తేశాడు.

అనిల్ కపూర్ ఇలా వ్రాశాడు, మహేష్ బాబు మా ఈవెంట్‌కు హాజరైనందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అతని స్టార్ క్రేజ్ గురించి ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ గురించి అనిల్ కపూర్ చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్ట్రెయిట్ హిందీ సినిమా చేయకపోయినా, బాలీవుడ్ నటులు మరియు నార్త్ ప్రేక్షకులలో మహేష్ బాబుకు చాలా గౌరవం ఉంది. ఇప్పుడు పరిస్థితే ఇలా ఉంటే ఒక్కసారి రాజమౌళితో మహేష్ బాబు సినిమా రిలీజ్ అయితే ఎలాంటి విధ్వంసం జరుగుతుందో ఊహించుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు