
విజయం అందించిన ఆనందం, గర్వం మరేదీ ఇవ్వదన్నది నానుడి. ఇప్పుడు ఆ ఆనందాన్ని యువ దర్శకుడు అనీల్ రావిపూడి తన ‘పటాస్’ సినిమా విజయం ద్వారా వంద శాతం పొందగలుగుతున్నాడు.
కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా నిన్న విడుదలై అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సూపర్ హిట్ టాక్ తో నడుస్తుంది. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్ చెయ్యడంలో సఫలమైన అనీల్ వైపు ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టి పడింది. మాస్ పల్స్ తెలిసిన టాలెంట్ కలిగిన వ్యక్తిగా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ ని చూపించిన తీరుపై అనీల్ ప్రశంసలు అందుకుంటున్నాడు.
‘పటాస్’ సినిమాలో శృతి సోధి హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రాన్ని ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మించాడు.

