తండ్రిగా మారిన మహేష్ దర్శకుడు

తండ్రిగా మారిన మహేష్ దర్శకుడు

Published on Jan 5, 2020 9:49 AM IST

anil

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తండ్రి అయ్యారు. ఆయన సతీమణి నేటి ఉదయం ప్రసవించగా అబ్బాయి పుట్టాడు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ మహేష్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అలాగే అనిల్ రావిపూడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుకగా ఈనెల 11న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి ముందే దర్శకుడు అనిల్ ఇంట్లో పండుగ వాతావరణం చోటు చేసుకుంది.

అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు విడుదలకు ముందే వచ్చిన అతి పెద్ద గిఫ్ట్ కి ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారట. ఇక గత వారం రోజులుగా విడుదల విషయంలో జరిగిన సందిగ్దతకు తెరదించుతూ నిన్న విడుదల తేదీ ప్రకటించారు. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా రష్మిక మందనా హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు