ప్రస్తుతం కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎలా జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. దానిని వినోదం కోసమో లేక విజ్ఞానం కోసమో వాడితే బాగానే ఉంటుంది కానీ మరో రకంగా వాడితే మాత్రం పరిణామాలు కూడా అంతే రీతిలో ఉంటాయి. ఇలా AI తో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రెండ్ వీడియోలు వస్తున్నాయి.
మరి ఈ లేటెస్ట్ ట్రెండ్ లో దర్శకుడు అనీల్ రావిపూడి కూడా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో “మన శంకర వరప్రసాద్ గారు” చేస్తున్న సంగతి తెలిసిందే. “అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు” అంటూ క్రేజీ వీడియో పోస్ట్ చేశారు.
మరి ఇందులో ఒకే దగ్గర నుంచి ఖైదీ చిరంజీవిని, గ్యాంగ్ లీడర్ ఇంకా ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, జగదేక వీరుడు అతిలోక సుందరి ఇలా పలు ఐకానిక్ సినిమాలు పాత్రల్లో మెగాస్టార్ నుంచి ఇప్పుడు తన మన శంకర వరప్రసాద్ గారు వరకు తన డైరెక్షన్ లో మెగాస్టార్ ని కెమెరాలో చూపిస్తున్నట్టుగా డిజైన్ చేసి ఈ రకంగా కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నారు. దీనితో ఈ పోస్ట్ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా మారింది.
Going with the trend ????????????
అలా నేను చూస్తూ పెరిగిన మెగాస్టార్ నుంచి, ఇలా నేను డైరెక్ట్ చేసే మెగాస్టార్ వరకు????????????
Thanks to AI ????
(‘AI’ ని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు ????)#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/o23yvZOlMw— Anil Ravipudi (@AnilRavipudi) December 21, 2025
