ఆ విషయంలో సుకుమార్, కొరటాల కంటే అనిల్ భేష్..!

Anil Ravipudi1

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు చిత్ర షూటింగ్ ఆరునెలల్లో పూర్తి చేసి చెప్పినట్లుగానే సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరిలో ఎఫ్2 చిత్రాన్ని విడుదల చేసి సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి మరో ఆరు నెలల్లో మహేష్ తో కథను ఒకే చేయించి వచ్చే సంక్రాంతికి ఆసినిమాను విడుదలకు రెడీ చేయడం మాములు విషయం కాదు. స్టార్ డైరెక్టర్స్ గా ఉన్న సుకుమార్, కొరటాల లాంటి వారు కూడా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఏడాది పైగా మరో మూవీ మొదలుపెట్టడానికి వెయిట్ చేయగా అనిల్ మాత్రం మహేష్ లాంటి సూపర్ స్టార్ తో అదే ఏడాది కాలంలో మరో సినిమా విడుదలకు సిద్ధం చేశారు.

జులై 5న సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ మొదలుకాగా డిసెంబర్ 18న పూర్తిచేయడం జరిగింది. మహేష్ తో ఇంతకు ముందు పనిచేసిన ఏ దర్శకుడు ఇంత వేగంగా షూటింగ్ ముగించిన దాఖలాలు లేవు. దిల్ రాజు సమర్పణలో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా 2020 జనవరి 11న సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా, విజయ శాంతి ఓ కీలక రోల్ చేస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version