ఉగాది రోజున కొత్త సినిమాని ప్రకటించనున్న అనిల్ రావిపూడి !
Published on Mar 14, 2018 10:32 am IST

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న మల్టీస్టారర్ సినిమాకు సంభందించి అధికారిక ప్రకటన ఉగాది రోజున వెలువడనుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ పక్కన తమన్నా నటించబోతోందని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ పూర్తైన ఈ సినిమా మే నుండి ప్రారంభం కానున్నట్లు వినికిడి.

తాజాగా అనిల్ రావిపూడి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రేక్షకులను రెండు గంటల ముప్పై నిమిషాలు నవ్వించడానికి చేసే ప్రయత్నం ఈ సినిమా అని చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన్నుండి మరో కామెడి ఎంటర్టైనర్ రాబోతోందని.

 
Like us on Facebook