క్రేజ్ అంటే ఇది.. పట్టాలెక్కక ముందే అమ్ముడైన అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ..!

క్రేజ్ అంటే ఇది.. పట్టాలెక్కక ముందే అమ్ముడైన అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ..!

Published on Apr 13, 2026 8:00 PM IST

Anil Ravipudi

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి తన ‘హిట్ మిషన్’ను కొనసాగిస్తూ 2027 సంక్రాంతి రేసులోకి రాబోతున్నాడు. వెంకటేష్ మరియు కల్యాణ్ రామ్‌ల కలయికలో రూపొందుతున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రంపై అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో కృతిశెట్టి ఒక హీరోయిన్‌గా ఫిక్స్ కాగా, మరో కీలక పాత్ర కోసం కీర్తి సురేష్ పేరును పరిశీలిస్తున్నారు.

ఈ సినిమా ఇంకా సెట్స్‌పైకి వెళ్లకముందే డిజిటల్ రైట్స్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. అనిల్ రావిపూడి గత చిత్రాలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాటలోనే, ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా జీ5 సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఈ దర్శకుడి సినిమాలకు ఓటీటీలో వచ్చే క్రేజ్ మరియు రేటింగుల దృష్ట్యా ఈ డీల్ రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వైజాగ్‌లో శరవేగంగా జరుగుతున్నాయి. తన ప్రతి సినిమా స్క్రిప్ట్‌ను వైజాగ్‌లోనే పూర్తి చేసే సెంటిమెంట్ ఉన్న రావిపూడి, ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌ను లాక్ చేసినట్లు సమాచారం. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి, సంక్రాంతి సీజన్‌లో మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు