క్లీన్ ఎంటర్టైనర్ “ఎఫ్2” కు జాతీయ స్థాయి గుర్తింపు.!

Published on Oct 21, 2020 5:08 pm IST

మన టాలీవుడ్ లో తన సినిమాలతో సెపరేట్ ట్రెండ్ ను సెట్ చేసుకున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఎంటెర్టైన్మెంటే ప్రధాన లక్ష్యంగా అనీల్ తెరకెక్కించే అన్ని సినిమాలు కూడా ఒకదాన్ని మించి మరొకటి సూపర్ హిట్టయ్యాయి. అలా అనీల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటైన క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ “ఎఫ్2″(ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) కు జాతీయ స్థాయి పురస్కారం దక్కింది.

విక్టరీ వెంకటేష్ మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా మరియు మెహ్రీన్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రం గత 2019 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఇండియన్ పనోరమా క్యాటగిరీ లో ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. అది కూడా మన తెలుగు నుంచి ఈ ఒక్క చిత్రానికే అవార్డు రావడం గమనార్హం.

దీనితో తన సినిమా ఇలా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం తనకు చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉందని దర్శకుడు అనీల్ రావిపూడి తెలిపారు. అంతే కాకుండా తన హీరోలు విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ అలాగే ఇతర క్యాస్ట్ కు థాంక్స్ తెలిపారు. అలాగే ఇలాంటి నవ్వుల ఎంటర్టైనింగ్ చిత్ర నిర్మాణానికి కారకులు అయిన నిర్మాత దిల్ రాజు మరియు శిరీష్ గార్లకి స్పెషల్ థాంక్స్ తెలుపుతున్నాని ఆనందం వ్యక్తం చేశారు. రీసెంట్ గా అనీల్ రావిపూడి సూపర్ స్టార్ మహేష్ తో “సరిలేరు నీకెవ్వరు” అనే భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :