సంక్రాంతి 2027 లాక్ చేస్తున్న అనిల్ రావిపూడి.. క్యాస్టింగ్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధం..!

Anil Ravipudi

టాలీవుడ్ హిట్ మెషిన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి సెన్సేషన్ క్రియేట్ చేయడంతో అభిమానులు నిజమైన పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రంతో వరుసగా తొమ్మిదో హిట్ అందుకున్నాడు.

అయితే, ఇప్పుడు ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా ముగియడంతో అనిల్ రావిపూడి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. తన నెక్స్ట్ చిత్రాన్ని ఎవరితో చేయాలి అనే విషయంపై ఆయన త్వరలోనే ఓ నిర్ణయానికి రాబోతున్నారట. అంతేగాక, 2027 సంక్రాంతికి మరోసారి తన సత్తా చాటేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నట్లు సినీ సర్కిల్స్ టాక్.

దీంతో అనిల్ రావిపూడి స్పీడ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మరి వచ్చే సంక్రాంతికి ఏ హీరోకు హిట్ ఇచ్చేందుకు ఈ డైరెక్టర్ రెడీ అవుతున్నాడో వేచి చూడాలి.

Exit mobile version