రణబీర్ కపూర్ పై ‘ఆనిమల్’ నటి తృప్తి డిమ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

రణబీర్ కపూర్ పై ‘ఆనిమల్’ నటి తృప్తి డిమ్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Dec 5, 2023 2:08 AM IST


ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ఆనిమల్. ఈ మూవీ పై ప్రారంభం నాటి నుండి మంచి అంచనాలు ఉండడం, ఇక రిలీజ్ అనంతరం ఆ అంచనాలు అందుకుని ప్రస్తుతం ఆనిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగా టాక్, కలెక్షన్ తో కొనసాగుతుండడం విశేషం. ఇక ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా మరొక కీలక పాత్రలో యువ బాలీవుడ్ నటి తృప్తి డిమ్రి కీలక పాత్ర చేసారు.

విషయం ఏమిటంటే, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా తృప్తి డిమ్రి మాట్లాడుతూ తామందరం కలిసి ఎంతో కష్టపడ్డ ఆనిమల్ మూవీని ఆడియన్స్ ఇంతలా ఆదరిస్తుండడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. అలానే హీరో రణబీర్ కపూర్ ఎంతో మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. షూటింగ్ సమయంలో ఆయన యాక్టింగ్ కి సంబంధించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పేవారని, అటువంటి టాలెంటెడ్ నటుడితో మరొకసారి నటించాలని ఉందని తృప్తి అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు