జపాన్‌లో రిలీజ్‌కు సిద్ధమైన ‘యానిమల్’.. అక్కడ కూడా వంగా విధ్వంసమే..?

జపాన్‌లో రిలీజ్‌కు సిద్ధమైన ‘యానిమల్’.. అక్కడ కూడా వంగా విధ్వంసమే..?

Published on Dec 24, 2025 2:00 PM IST

యానిమల్

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమా ఏకంగా రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు క్రియేట్ చేసింది.

ఈ సినిమాను పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేయగా అన్ని భాషల్లో ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సినిమా జపాన్ దేశంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. యానిమల్ చిత్రాన్ని జపాన్ దేశంలో ఫిబ్రవరి 13, 2026న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు.

దీంతో యానిమల్ జపాన్‌లోనూ విధ్వంసం సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రీ, బాబీ డియోల్, అనిల్ కపూర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు