‘సింగం 3’ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చిన అనిరుధ్!

‘సింగం 3’ ప్రాజెక్టు నుంచి బయటకొచ్చిన అనిరుధ్!

Published on Sep 12, 2015 2:00 PM IST

Anirudh-Ravichander

‘గజిని’తో తెలుగులో పాపులర్ అయిన తమిళ స్టార్ హీరో సూర్యను, ఇక్కడా స్టార్‌ను చేసిన సినిమాలుగా ‘సింగం'(యముడు), ‘సింగం 2′(సింగం) సినిమాలు నిలుస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్‌గా నిలిచిన ఈ సిరీస్‌లో మూడో సినిమాగా ‘సింగం 3′ రానున్న విషయం తెలిసిందే. హరి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ను ఎంపికచేశారు. అయితే తాజా సమాచారం మేరకు అనిరుధ్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలను మొదలుపెట్టిన సినిమా యూనిట్ త్వరలోనే సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి అనిరుధ్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి గల కారణమేదీ ఇంకా తెలియరాలేదు. ఇక దీంతో సింగం సిరీస్‌లో గత రెండు సినిమాలకూ సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌ను ఈ మూడో సినిమాకూ ఎంపిక చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందని సమాచారం. అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లుగా నటించనున్న ఈ సినిమా సూర్య ’24’ సినిమా పూర్తైన వెంటనే సెట్స్‌పైకి వెళ్ళనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు