బజ్ : సూపర్ స్టార్ మూవీలో అనిరుద్ క్యామియో రోల్ ?

బజ్ : సూపర్ స్టార్ మూవీలో అనిరుద్ క్యామియో రోల్ ?

Published on Apr 30, 2024 10:01 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న మూవీ వెట్టయాన్. ఈ మూవీలో రానా దగ్గుబాటి, ఫహద్ ఫాసిల్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్ తదితరులు కీలక పాత్రలు చేస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంది.

మ్యాటర్ ఏమిటంటే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచందర్ ఈ మూవీలో ఒక క్యామియో రోల్ లో కనిపించనున్నారనేది లేటెస్ట్ కోలీవుడ్ బజ్. కాగా రజినీకాంత్ తో కలిసి ఒక సాంగ్ లో అనిరుద్ కనిపించనున్నారని, అలానే రజిని తో కలిసి ఆయన సరదాగా డ్యాన్స్ స్టెప్స్ కూడా వేయనున్నారని టాక్. మొత్తంగా అన్ని కార్యక్రమాలు ముగించి వెట్టయాన్ మూవీని అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు