బాలయ్య డిక్టేటర్ షెడ్యూల్ ఫినిష్ చేసిన అంజలి

Anjali
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99వ సినిమా డిక్టేటర్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. బాలయ్యతో పాటు మిగతా టీం అంతా కంటిన్యూగా షూట్ చేస్తూ సినిమాని ఆన్ టైం ఫినిష్ చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. డిక్టేటర్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపిస్తున్న అంజలి కూడా కత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా షెడ్యూల్ లో పాల్గొంటోంది. ఈ రోజుతో అంజలి ఈ షెడ్యూల్ తో దాదాపు తన పార్ట్ కి సంబందించిన టాకీ పార్ట్ ని ఫినిష్ చేసింది.

వచ్చే నెల నుంచి స్టార్ట్ అయ్యే సాంగ్ షూటింగ్ షెడ్యూల్ లో మళ్ళీ అంజలి వచ్చి డిక్టేటర్ టీంతో జాయిన్ అవుతుంది. రీసెంట్ గా ఈ సినిమాలో మూడవ హీరోయిన్ గా అక్షని సెలక్ట్ చేసారు. ప్రస్తుతం బాలయ్య – అక్షలపై వచ్చే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. వీరిద్దరే కాకుండా సోనాల్ చౌహాన్ కూడా మరో హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి శ్రీ వాస్ డైరెక్టర్. బాలయ్యని మునుపెన్నడూ చూపిచ్న్హని స్టైలిష్ లుక్ లో చూపించనున్న ఈ సినిమాకి కోన వెంకట్ – గోపి మోహన్ లు కలిసి కథని అందించారు. ఎరోస్ తో కలిసి శ్రీవాస్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.

Exit mobile version