యాక్సిడెంట్ కి గురైన అంజలి.!

యాక్సిడెంట్ కి గురైన అంజలి.!

Published on Mar 10, 2013 12:11 PM IST

Anjali

సంక్రాంతి కానుకగా వచ్చిన ”సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో తెలుగు వారి మదిని గెలుచుకున్న అందాల భామ అంజలి ప్రస్తుతం తమిళ్ లో చేస్తున్న ‘ఊర్ సుత్త్రి పురణం’ మూవీ సెట్లో యాక్సిడెంట్ కి గురైంది. చెన్న శివార్లలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్లో అంజలి చూసుకోకుండా సినిమా కోసం ఉపయోగిస్తున్న ఓ కరెంట్ వైర్ మీద కాలేయడంతో చిన్నపాటి ఎలక్ట్రిక్ షాక్ కి గురైంది. అక్కడ ఉన్న సినిమా యూనిట్ మొదట ఫస్ట్ ఎయిడ్ చేసి ఆమెని హాస్పిటల్ కి తరలించారు, అంజలికి పెద్ద ప్రమాదం ఏమీ లేదని, బెడ్ రెస్త్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పిన తర్వాత సినిమా యూనిట్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారణం వల్ల తాత్కాలికంగా సినిమా షూటింగ్ నిలిపి వేశారు.

తమిళ్ డబ్బింగ్ మూవీ ‘జర్నీ’ తో తెలుగులో పేరుతెచ్చుకున్న అంజలి ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లో కీ రోల్ చేసే అవకాశం కొట్టేసింది. ప్రస్తుతం అంజలి రవితేజ, శ్రుతి హాసన్ నటిస్తున్న ‘బలుపు’ సినిమాలో ఓ మెడికో పాత్రలో నటిస్తోంది. ఈ సంవత్సరం మేలో ‘బలుపు’ విడుదలయ్యే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు