నేడు గుమ్మడికాయ కొట్టిన ‘అంజాన్’ టీం

నేడు గుమ్మడికాయ కొట్టిన ‘అంజాన్’ టీం

Published on Jun 22, 2014 8:01 PM IST

anjana (1)
తమిళ స్టార్ హీరో సూర్య, సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘అంజాన్’. ఈ సినిమా షూటింగ్ నేటితో ముగిసింది. దాంతో ఈ చిత్ర టీం ఈ సినిమాకి గుమ్మడికాయ కొట్టేసారు. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేస్తుందని ఈ చిత్ర టీం ఆశిస్తోంది.

త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి ఈ చిత్ర డైరెక్టర్ లింగుస్వామి ప్లాన్ చేస్తున్నాడు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయనున్నారు. అలాగే ఈ సినిమాని తెలుగు అనువాద హక్కులను లగడపాటి శ్రీధర్ ఓ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు.

తాజా వార్తలు