“వకీల్ సాబ్” కు మరో బ్యాడ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యిందా.?

Published on Apr 12, 2021 1:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ కం బ్యాక్ చిత్రం “వకీల్ సాబ్”. భారీ అంచనాలతో ఇటీవల విడుదల కాబడిన ఈ చిత్రం భారీ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ ను నమోదు చేసింది.

అంతే కాకుండా మొదటి రోజుతో పాటుగా రెండో రోజు కూడా భారీ వసూళ్లను రాబట్టి స్ట్రాంగ్ గా నిలిచింది. అయితే ఇప్పటికే కరోనా ప్రభావం సహా మరికొన్ని ఇబ్బందులు వకీల్ సాబ్ వసూళ్లకు ఆటంకం కలిగించాయని కొంతమంది పవన్ అభిమానులు కాస్త నిరాశలో ఉన్నారు.

మరి దీనికి అదనంగా మరో బాడ్ ఎఫెక్ట్ ఈ చిత్రం పడినట్టు తెలుస్తుంది. ఇటీవలే మొదలైన ఐపీఎల్ మ్యాచులు వకీల్ సాబ్ ఈవెనింగ్ షోలకు గండి కొట్టడం ప్రారంభం అయ్యినట్టు తెలుస్తుంది.

మేజర్ టీం మ్యాచుల నుంచే ఇది స్టార్ట్ అయ్యింది. సాలిడ్ మౌత్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మరి ఇక ముందు వసూళ్లు ఎలా ఉంటాయో చూడాలి.ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించగా థమన్ సంగీతం అందించాడు అలాగే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :