మళ్ళీ ఇంతలోనే విజయ్ భారీ సినిమా నుంచి మరో అప్డేట్.!

మళ్ళీ ఇంతలోనే విజయ్ భారీ సినిమా నుంచి మరో అప్డేట్.!

Published on Apr 12, 2024 3:58 PM IST


ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ (Thalapathy Vijay) హీరోగా మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time). మరి ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమా కాగా ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే ఓ బిగ్ అప్డేట్ రిలీజ్ డేట్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంతలోనే మరో అప్డేట్ అందిస్తున్నట్టుగా హింట్ ఇస్తున్నారు.

సినిమా నిర్మాణ సంస్థ సీఈఓ అర్చన కల్పతి దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి ఉన్న ఓ పిక్ ఐశ్వర్య కల్పతి షేర్ చేసి మరో అప్డేట్ ని ప్లాన్ చేస్తున్నారా అంటూ హింట్ ఇచ్చారు. దీనితో మళ్ళీ అతి త్వరలోనే సినిమా నుంచి మరో అప్డేట్ ఉండొచ్చని చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏజిఎస్ ఎంటెర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు