రజినీ అభిమానులకు ఇది నిరుత్సాహకరమైన వార్తే ?

Published on Oct 29, 2020 2:13 am IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకవైపు సినిమాలు చేస్తూనే ఇంకోవైపు పొలిటికల్ పార్టీని ఏర్పాటుచేసి ఎన్నికల్లోకి దిగే ఏర్పాట్లు చేసుకుంటుండగా కరోనా లాక్ డౌన్ వచ్చి పడింది. దీంతో ఆయన ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. షూటింగ్స్ అన్నీ మొదలవుతున్నా రజినీ సినిమా మాత్రం రీస్టార్ట్ కావట్లేదు. పెద్ద వయసు కావడం వలన కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేవరకూ ఇంటికే పరిమితం కావాలని రజినీ అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడప్పుడే ఆయన సినిమా మొదలయ్యేలా కనిపించట్లేదు.

ఈ వార్తతోనే ఆయన అభిమానులు నిరుత్సాహపడిపోతే ఇంకో షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు సూపర్ స్టార్. ఇన్నాళ్లు వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని పరిపూర్ణంగా సిద్ధం చేసి ఎన్నికల్లోకి దిగుతానని చెబుతూ వచ్చారు సూపర్ స్టార్. కానీ ఇప్పడూ ఆ నిర్ణయాన్ని కూడా మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది. దీనికి కూడ కోవిడ్ ఆందోళనే కారణం. ప్రస్తుతం రజినీ వయసు 70 ఏళ్ళు. ఈ వయసులో ర్యాలీలు, సభలు అంటూ క్యాంపెనింగ్ చేస్తే ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. తనతో పాటు అభిమానుల ఆరోగ్యాలను కూడ ఆపదలోకి నెట్టినట్టు ఉంటుంది.

బహిరంగా ప్రజల్లోకి వెళ్లకుండా పార్టీని ఏర్పాటు చేయడం, ఎన్నికలకు వెళ్లడం అంటే జరిగే పని కాదు. అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీచేయకూడని రజినీ భావిస్తున్నట్టు తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ వచ్చి వైరస్ పూర్తిగా తొలగిపోయిందనే నమ్మకం కలిగినప్పుడే ఆయన ప్రజల్లోకి వస్తారని చెబుతున్నారు. అంటే ఈసారి తమిళనాడు ఎన్నికల్లో రజినీ పార్టీ ఉండబోదనే అనుకోవాలి. త్వరలోనే ఈ విషయమై సూపర్ స్టార్ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం :