లేటెస్ట్ గా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ అనౌన్స్ చేసిన చిత్రం “సలార్” తో మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ ఎత్తున హైప్ ను నమోదు చేసుకున్నాడు. కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఇది ఊహించని కాంబో కావడంతో తారా స్థాయి అంచనాలు నెలకొన్నాయి. మరి అలాగే ఈ సినిమా క్యాస్టింగ్ విషయంలో కూడా నీల్ దగ్గర సాలిడ్ ప్లానింగ్స్ ఉన్నాయని టాక్ ఆ మధ్యన వచ్చింది.
మరి అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో మళయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అలాగే ఈ రోల్ సినిమాలో అత్యంత కీలకమైనది అని కూడా ఇందులో వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ నిజమైతే అన్ని వైపులా బాక్సాఫీస్ ను ఈ మాస్ కాంబో షేక్ చెయ్యడం ఖాయం అని చెప్పాలి.
