విజయ్ “గోట్” లో మరో హీరో?

విజయ్ “గోట్” లో మరో హీరో?

Published on May 27, 2024 10:00 AM IST

ఇళయ దళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటికే చాలా మేర షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో అనేక సర్ప్రైజ్ లు కూడా ఉన్నాయి. మరి లేటెస్ట్ గా ఇంకో ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు వినిపిస్తోంది.

ఈ చిత్రం ఓ ప్రముఖ యంగ్ హీరో కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ హీరో ఎవరు తెలుగు నుంచి ఉంటాడా లేక తమిళ్ నుంచి ఉంటాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు అలాగే ఏ జి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు