‘ఎన్టీఆర్’ కోసం మరో హీరోయిన్ ?

NTR

ఎన్టీఆర్ – చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర గురించి ఒక ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికే మొదటి హీరోయిన్ విదేశీ భామను ఫైనల్ చేసిన రాజమౌళి.. మరో హీరోయిన్ పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్ ను తీసుకున్నారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ ను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఐశ్వర్య రాజేష్ నటించబోతుందని సమాచారం.
ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు.

Exit mobile version