‘వారణాసి’ రేస్ లోనే మరో హై బడ్జెట్ సినిమా?

aa22

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమానే వారణాసి. ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ ఆల్రెడీ వచ్చే ఏడాది వేసవి కానుకగా ఏప్రిల్ 7కి సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ మూమెంటంలో మరిన్ని ఇతర భారీ సినిమాలు ఇండియన్ సినిమా నుంచి సమ్మర్ బరిలో ప్లాన్ లో ఉన్నట్టు తెలిసింది.

అయితే ఈ రేస్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీల హై బడ్జెట్ సినిమా కూడా రాబోతున్నట్టు ఇప్పుడు తెలుస్తోంది. ఈ సినిమాని కూడా మేకర్స్ వచ్చే ఏడాది వేసవి రేస్ లోనే లాక్ చేశారట. మరి దీనికి వారణాసి సినిమాకి ఎంత గ్యాప్ ఉంటుంది అనేది చూడాలి. బన్నీ సినిమాకి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్ద్స్ లోనే మొత్తం సెట్ చేస్తున్నారు. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అని కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు.

Exit mobile version