“RRR” షూట్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

“RRR” షూట్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.!

Published on Dec 5, 2020 11:03 AM IST

ఇప్పుడు దేశం గర్వించదగ్గ మరో బిగ్గెస్ట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” షూటింగ్ ను దర్శక ధీరుడు రాజమౌళి శరవేగంగా పూర్తి చేసేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు కరోనా వల్ల లాంగ్ గ్యాప్ వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం నిర్విరామంగా రాత్రి పగళ్లు షూట్ తో హోరెత్తిస్తున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో షూట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ గానే ఒక మేజర్ షెడ్యూల్ ను పూర్తి చేసి మహాబలేశ్వర్ లో చిన్న షెడ్యూల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఈ చిత్రం షూట్ పైనే ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.

మేకర్స్ అప్పుడే మహాబలేశ్వర్ లోని షూట్ ను పూర్తి చేసేసినట్టు తెలుస్తుంది. అలాగే నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో కూడా ప్లాన్ చేసేసారట. ఇక అలాగే ఈ షెడ్యూల్ కు గాను బాలీవుడ్ స్టార్ నటి ఆలియా భట్ పాల్గొంటుంది అని ఇప్పుడు టాక్. ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండగా డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు