ప్రభాస్ సినిమా నుంచి మరో లీక్?

ప్రభాస్ సినిమా నుంచి మరో లీక్?

Published on Feb 21, 2024 7:06 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ లెవెల్ సినిమా “కల్కి 2898ఏడి” కూడా ఒకటి. అయితే ఈ సినిమా నుంచి రీసెంట్ గానే లీక్ లు బయటకొచ్చి మళ్లీ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కాకుండా మరో సినిమా “ది రాజా సాబ్” నుంచి కూడా లీక్ ఒకటి బయటకి వచ్చినట్టుగా టాక్ వైరల్ గా మారింది.

అయితే ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ డైలాగ్ లీక్ అయ్యినట్టుగా ఓ లైన్ వైరల్ గా మారింది. కానీ ఇది ఈ సినిమా లోనిది కాదని తెలుస్తోంది. అది జస్ట్ రూమర్ మాత్రమే అని ప్రభాస్ సినిమా నుంచి మరో లీక్ రాలేదని సినిమా కాంపౌండ్ వర్గాల నుంచే క్లారిటీ బయటకి వచ్చింది. సో రాజా సాబ్ డైలాగ్ ఏది లీక్ కాలేదని గుర్తించాలి.. ఇక ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం తెరకెక్కిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు