రికార్డు వసూళ్లతో మరో మళయాళ సినిమా సెన్సేషన్

రికార్డు వసూళ్లతో మరో మళయాళ సినిమా సెన్సేషన్

Published on Mar 5, 2024 1:58 PM IST

ఇండియా మొత్తం మీద కూడా మూవీ లవర్స్ కి బాగా నచ్చే ఇండస్ట్రీ చిత్రాల్లో మళయాళ ఇండస్ట్రీ సినిమాస్ కి ఒక ప్రత్యేకమైన స్తానం ఉంటుంది అని చెప్పాలి. అపారమైన టాలెంట్ కలిగిన దర్శకులు నటీనటుల నుంచి వచ్చే పలు చిత్రాలు వరల్డ్ వైడ్ గా కూడా పాపులర్ అవుతున్నాయి. అయితే ఈ ఒక్క ఏడాదిలో జస్ట్ ఫిబ్రవరిలోనే మూడు నాలుగు చిత్రాలు వండర్స్ సెట్ చేసాయి.

మరి ఈ చిత్రాల్లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం “మంజుమ్మేల్ బాయ్స్” చిత్రం కూడా ఒకటి. షాహిర్, శ్రీనాథ్ బాసిల్, బాలు వర్గేసి తదితరులు నటించిన ఈ చిత్రాన్ని చిదంబరం దర్శకత్వం వహించగా ఈ చిత్రం గత ఫిబ్రవరి 22న వరల్డ్ వైడ్ గా మళయాళంలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం ఇప్పుడు రికార్డు వసూళ్లతో మళయాళ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది.

మళయాళ సినిమాలో ఓ సినిమా 100 కోట్ల మార్క్ ని అందుకోవడం అనేది అరుదుగా జరిగే పని. అది కూడా బిగ్ స్టార్స్ ఉండి హిట్ కొడితే తప్ప ఒక టైం 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యేది కాదు కానీ ఇప్పుడు ఈ సెన్సేషనల్ ఫీట్ ని ఈ చిత్రం అందుకుంది. కేవలం 2 రోజుల్లోనే ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లు అందుకొని ఇప్పుడుకి కూడా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుందట. మరి నెక్స్ట్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ ని కూడా ఇది క్రాస్ చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ ట్రాకర్స్ కూడా చెబుతున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఫైనల్ రన్ ఎక్కడ ఆగుతుంది అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు