శ్రీ సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్ బేనర్ పై ప్రొడక్షన్ నెం 2గా బేబీ దమరి సమర్పణలో సి.హెచ్ సత్య సుమన్ బాబు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం జనవరి 27 నుండి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత సి. హెచ్ సత్య సుమన్ బాబు మాట్లాడుతూ – ” ఒక ఐ.ఎ.ఎస్ అధికారి అవినీతి పై పోరాటం చేసి పూర్తిగా అవినీతిని ఎలా అంతమొందించారు అని తెలియజెప్పే మంచి సందేశాత్మక చిత్రం ఇది. జనవరి 27 నుండి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ చిత్రానికి కథ, మాటలు కె.బాలకిషోర్ అందిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ప్రమోద్ కుమార్. మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపిక జరుగుతోంది. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాను”అన్నారు. బేనర్: సుమన్ వేంకటాద్రి ప్రొడక్షన్స్,
సమర్పణ: బేబి దమరి, నిర్మాత, దర్శకుడు: సి హెచ్ సత్య సుమన్ బాబు, కథ, మాటలు: కె. బాలకిషోర్, సంగీతం: ప్రమోద్ కుమార్.


