రచయిత, సింగర్ పెంచల్ దాస్ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ‘దారి చూడు’ పాటను రచించి పాడటం జరిగింది. తిరుపతి ఆర్ట్స్ కాలేజీ లో జరిగిన మీటింగ్స్ లో పెంచల్ దాస్ పాటలు పాడడం వల్ల డైరెక్టర్ మేర్లపాక గాంధీవాళ్ళ తండ్రి పెంచాల్ దాస్ ను చూడ్డం, ఆ తరువాత తనకు సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. ‘ఎక్స్ ప్రెస్ రాజ’ సినిమాకు అవకాశం వచ్చినా అనారోగ్యం కారణాల వల్ల పాట పాడలేక పోయాడు పెంచాల్ దాస్.
ఆ సినిమా తరువాత మేర్లపాక గాంధీ ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాకు పాడగలవా అని అడిగారు. వెంటనే ఓకే అని చెప్పడం వల్ల సినిమాలో దారి చూడు మామా పాట పాడడానికి అవకాశం వచ్చింది పెంచల్ దాస్ కు. తాజాగా ఈ సింగర్ భీమినేని శ్రీనివాస్ దర్శత్వంలో అల్లరి నరేష్ నటిస్తోన్న సినిమాకు పాడే అవకాశం లభించడం విశేషం. ఈ పాటను అయనే రచించడం జరిగింది.


