రజనీ వచ్చే వరకు ‘ప్రతిరోజూ పండగే’ !

రజనీ వచ్చే వరకు ‘ప్రతిరోజూ పండగే’ !

Published on Dec 30, 2019 10:56 AM IST

Prathiroju Pandage 1

మెగాహీరో సాయి తేజ్ తాజా చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ బాక్స్ ఆఫీస్ వద్ద బ్రహ్మండమైన వసూళ్లను రాబడుతోంది. మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఆ తర్వాతి రోజుల్లో కూడా మొదటిరోజు కనబర్చిన రన్ కనబర్చింది. దీంతో రెండో వారం పూర్తికాకముందే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దగ్గరకు చేరుకుంది. మధ్యలో క్రిస్మస్ లాంటి పండుగ రావడం కూడా బాగా కలిసొచ్చింది సినిమాకు.

ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు కనెక్టవ్వడంతో థియేటర్లలో ఆక్యుపెన్సీ గొప్పగా ఉంటోంది. ఈ చిత్రం తర్వాత ప్రభావం చూపించదగిన సినిమా ఏదీ రాకపోవడంతో చిత్రానికి స్టడీ దక్కుతోంది. ఇక వచ్చే శుక్రవారం కూడా పెద్ద సినిమాలేవీ లేవు. చెప్పాలంటే జనవరి 9న రానున్న రజనీకాంత్ యొక్క ‘దర్బార్’ తప్ప ఈమధ్యలో చెప్పుకోదగిన రిలీజ్ ఏదీ లేదు. కాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద ఇంకొన్ని రోజులు తేజ్, మారుతిల సినిమా హడావిడే ఉండనుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటర్లు మంచి లాభాల్ని ఆర్జించడం ఖాయం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు