వైరల్ అవుతున్న పవన్ మరో లేటెస్ట్ లుక్.!

Published on Sep 25, 2020 10:00 am IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో మొదటి వరుసలో ఉన్న చిత్రం “వకీల్ సాబ్” కూడా ఒకటి. దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తాలూకా బ్యాలెన్స్ షూట్ మళ్ళీ మొదలు కానున్న తరుణంలో గత కొన్ని రోజుల కిందట పవన్ కు సంబంధించిన ఒక ఓల్డ్ ఫోటో వైరల్ కాగా..

ఇపుడు ఈ చిత్రానికి సంబంధించిన లేటెస్ట్ లుక్ అంటూ మరో ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే గత కొన్ని రోజుల కితం పవన్ ను చూసిన లుక్ కు ఇప్పుడు వైరల్ అవుతున్న లుక్ ను చూస్తే ఇంత తక్కువ టైం లో అంత చేంజ్ అయ్యారా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లాంగ్ హెయిర్ స్టైల్ తో మరియు ట్రిమ్ గడ్డం లుక్ లో స్లిమ్ గా పవన్ కనిపిస్తున్నారు. మరి ఈ ఫోటో లేటెస్ట్ దో పాతదో కానీ మొత్తానికి ఇపుడు సోషల్ మీడియా వర్గాల్లో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :

More