నాని “సరిపోదా శనివారం” మరో రిలీజ్ డేట్?

నాని “సరిపోదా శనివారం” మరో రిలీజ్ డేట్?

Published on Feb 13, 2024 8:00 AM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “హాయ్ నాన్న” తన కెరీర్ మరో మంచి హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఎప్పుడూ కూడా కొత్త కొత్త సబ్జెక్టు లతో అలరించే నాని ఈ చిత్రం తర్వాత తన కెరీర్ 31వ చిత్రాన్ని అయితే దర్శకుడు వివేక్ ఆత్రేయతో అనౌన్స్ చేసాడు. మరి ఆ చిత్రమే “సరిపోదా శనివారం”. అనౌన్సమెంట్ వీడియో తోనే సాలిడ్ బజ్ ని రేపిన ఈ చిత్రం ఇప్పుడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో తెరకెక్కుతుంది.

అయితే ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారని మేకర్స్ ఓ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నట్టుగా బజ్ వచ్చింది. మేకర్స్ ముందుగా అయితే ఆగస్ట్ 15 డేట్ ని లాక్ చేసారని రూమర్స్ వచ్చాయి. అయితే ఆ డేట్ లో ఉన్న భారీ చిత్రం “పుష్ప 2” ఒకవేళ రాకపోతే ఆ డేట్ ని లాక్ చేసుకోగా ఒకవేళ పుష్ప 2 వస్తే మరో రిలీజ్ డేట్ ని అనుకుంటున్నారట. అదే ఆగష్టు 29 కి ఫిక్స్ చేశారట. మరి దీనిపై అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు