సుకుమార్ నిర్మాణంలో వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది హెబ్బా పటేల్. ఆ సినిమా హిట్ కారణంగా హెబ్బాకు ఆ తరువాత బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ప్లాప్ లతో ఈ అమ్ముడికి ప్రస్తుతం ఛాన్స్ లు తగ్గాయి. దాంతో వరుసగా బోల్డ్ సినిమాలు అంగీకరిస్తూ రెచ్చిపోతుంది. లాస్ట్ సినిమా ’24 కిస్సెస్’లో తన బోల్డ్ యాక్టింగ్ తో హెబ్బా ఆకట్టుకున్నప్పటికీ ఆ సినిమా విజయం సాధించకపోవడంతో హెబ్బా కెరీర్ ఒరిగింది ఏమి లేదు.
అయితే తాజాగా హెబ్బా మరో బోల్డ్ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ ను అంగీకరించిందని తెలుస్తోంది. సుశాంత్ రెడ్డి అనే దర్శకుడు దర్శకత్వంలో ప్రిన్స్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాడికల్’ చిత్రంలో హెబ్బా నటిస్తోందట. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ లో హెబ్బా తో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారట.
