ఫైటర్ లో మరో సీనియర్ హీరో !

Published on Nov 23, 2020 7:22 pm IST

డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అంటూ ఓ సినిమా చేస్తోన్నాడు. ఇక ఈ చిత్రం ఓ డాన్ అతని కొడుకుకి మధ్య నడుస్తోందని.. డాన్ కొడుకుగా విజయ్ దేవరకొండ నటిస్తుండగా.. డాన్ గా మలయాళ హీరో సురేష్ గోపి కనిపించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అసలు సురేష్ గోపి అంటే తెలుగు వాళ్లకు పెద్దగా తెలియదు గానీ, మలయాళంలో ఆయన ఒకప్పుడు మంచి హీరో. తమిళనాట కూడా సురేష్ గోపికి మంచి గుర్తింపు ఉంది.

అయితే విజయ్ దేవరకొండ సురేష్ గోపి కొడుకుగా కేవలం పదిహేను నిముషాల ప్లాష్ బ్యాక్ స్టోరీలో మాత్రమే కనిపిస్తాడని.. తండ్రికొడుకుల ఎమోషన్ చాలా బాగుంటుందని తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ తో వచ్చిన గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం కొన్ని వర్కౌట్స్ చేశాడు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. అలాగే ఫైటర్ కోసం ప్రత్యేకంగా సిక్స్ ప్యాక్ కూడా చేశాడు. మరి విజయ్ దేవరకొండకు ఫైటర్ ఏ రేంజ్ హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More