పెళ్లికి మరో సీనియర్ హీరోయిన్ రెడీ !

పెళ్లికి మరో సీనియర్ హీరోయిన్ రెడీ !

Published on Apr 4, 2021 11:30 PM IST

సీనియర్ హీరోయిన్ త్రిష పెళ్లికి సంబంధించిన మేటర్ ఒకటి తెలిసింది. త్రిష పెళ్లి చేసుకోబోతుందని చెబుతున్నాయి తమిళ మీడియా వర్గాలు. వాటికి బలం చేకూర్చేలా త్రిష కూడా ఇప్పుడు సీరియస్ గా పెళ్లి గురించి థింక్ చేస్తోందట. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో టాప్ హీరోయిన్‌గా కొనసాగిన త్రిష‌కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు అయితే లేవు.

అందుకే, కొన్నాళ్ల క్రితమే పెళ్లి చేసుకునేందుకు త్రిష రెడీ అయింది. వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు గానీ, ఆ పెళ్లి మధ్యలోనే ఆగిపోయింది. ఇక తన పెళ్లి గురించి ఎప్పుడూ త్రిష ప్రస్తావించలేదు. కానీ చాల నెలలు తరువాత త్రిష పెళ్లి అంటూ మళ్ళీ వార్తలు వస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి అయితే ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

తాజా వార్తలు