‘నా పేరు సూర్య’ నుండి ఇంకో విశేషం !

4th, April 2018 - 05:42:16 PM

ఈ వేసవిలో విడుదలకానున్న భారీ చిత్రాల్లో అల్లు అర్జున్ నటిస్తున్న ‘నా పేరు సూర్య’ కూడ ఒకటి. బన్నీ ఆర్మ్ ఆఫీసర్ పాత్రలో నటించితిన్ ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రచయిత వక్కంతం వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ ఇంపాక్ట్, పాటలు రూపంలో కొన్ని విశేషాలు బయటకు రాగా ఇప్పుడు మరో విశేషం అభిమానుల్ని అలరించనుంది.

అదే డైలాగ్ ప్రోమో. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్బంగా ఈ ప్రోమో రిలీజ్ కానుంది. అలాగే ఈ చిత్రంలోని మూడవ పాట కూడ త్వరలోనే విడుదలకానుంది. లగడపాటి శిరీషా శ్రీధర్, బన్నీ వాష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఎల్లి అవ్రమ్ ఒక ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది. బాలీవుడ్ సంగీత దర్శకులు విశాల్, శేఖర్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.