నేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రాబోతున్న అత్యంత భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ నుండి వరసగా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు పోషిస్తున్న నటీనటుల బర్త్ డే సందర్భంగా పోస్టర్స్ రిలీజ్ చేస్తోంది టీమ్.
అయితే మరో మూడు రోజుల్లో మరో సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నారు రాజమౌళి బృందం. మరో మూడు రోజుల్లో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అజయ్ దేవగన్ బర్త్ డే రాబోతోంది. కాబట్టి ఆర్ఆర్ఆర్ నుంచి అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్బంగా ఏప్రిల్ 2వ తారీకున పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమాలో అజయ్ దేవగన్ లుక్ ఎలా ఉండబోతుందో చూడాలి.
కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం, చరణ్ అల్లూరి పాత్రల్లో కనిపించబోతున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఇక ‘బాహుబలి’ తరవాత జక్కన్న చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై ఆరంభం నుండి భారీ అంచనాలు భారతీయ అన్ని సినీ పరిశ్రమల్లో నెలకొన్నాయి సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
