“మేజర్” నుంచి టాలెంటెడ్ నటిని ఇంట్రో చేసిన శేష్.!

“మేజర్” నుంచి టాలెంటెడ్ నటిని ఇంట్రో చేసిన శేష్.!

Published on Sep 24, 2020 11:00 AM IST

మన టాలీవుడ్ లో మంచి స్పై అండ్ మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలను తీసి హాలీవుడ్ లెవెల్ ఎక్స్ పీరియెన్స్ ను అందించిన నటుడు అడవి శేష్. కేవలం నటునిగానే కాకుండా అద్భుతమైన రచయితగా కూడా శేష్ ఆకట్టుకున్నాడు. అయితే ఇపుడు అడవి శేష్ ముంబై టెర్రర్ దాడులలో వీర మరణం పొందిన ఉన్ని కృష్ణన్ గారి జీవిత చరిత్రపై తెరకెక్కిస్తున్న “మేజర్” చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో శేష్ ఒక అధికారిక అప్డేట్ ను అందిస్తానని చెప్పారు. అలా చెప్పినట్టుగానే ఈ చిత్రంలో ప్రముఖ టాలెంటెడ్ నటి సాయి మంజ్రేకర్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్టుగా కన్ఫామ్ చేసి మేజర్ టీం లోకి ఆహ్వానిస్తున్నట్టుగా ఖరారు చేసాడు. వచ్చే అక్టోబర్ నుంచి ఈమె షూట్ లో పాల్గొననుంది అని తెలిపారు. ఈ చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తుండగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్ వారు తెలుగులో మొదటి సినిమాగా ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

https://www.instagram.com/p/CFgYtkjJ_Q6/?igshid=6r3q42cevhk8

సంబంధిత సమాచారం

తాజా వార్తలు