భారీ మల్టీ స్టారర్ గా మారుతున్న “కన్నప్ప”

భారీ మల్టీ స్టారర్ గా మారుతున్న “కన్నప్ప”

Published on Feb 27, 2024 7:50 PM IST

టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ఈ చిత్రం లో ఇప్పటికే ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరొక స్టార్ హీరో ఈ భారీ బడ్జెట్ మూవీ లోకి చేరనున్నట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ ఈ చిత్రం లో భాగం కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.

AVA ఎంటర్ టైన్మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టీఫెన్ దేవాసీ, మణిశర్మ లు సంగీతం అందిస్తున్నారు. పలు స్టార్ హీరోల చేరికతో ఈ భారీ మల్టీ స్టారర్ హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు