మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి మరొక టాలీవుడ్ స్టార్ హీరో ?

మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి మరొక టాలీవుడ్ స్టార్ హీరో ?

Published on Feb 22, 2024 1:01 AM IST

ఇప్పటికే పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి ప్రవేశించారు. ముందుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ లో ఏ ఎం బి సినిమాస్ మల్టిప్లెక్స్ ని ఏషియన్ గ్రూప్ వారిలో కలిసి గ్రాండ్ గా నిర్మించారు.

హైదరాబాద్ లో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ మల్టిప్లెక్స్ అందరి ఆదరణతో కొనసాగుతోంది. అనంతరం ఏషియన్ సంస్థ వారితో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏ ఏ ఏ సినిమాస్ ని అలానే విజయ్ దేవరకొండ ఏ వి డి సినిమాస్ ని ప్రారంభించారు.

ఇక తాజగా వీరి లిస్ట్ లోకి మరొక స్టార్ హీరో అయిన మాస్ మహారాజా రవితేజ కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ దిల్ షుక్ నగర్ ప్రాంతంలో ఏషియన్ సంస్థతో కలిసి రవితేజ నిర్మించనున్న ఏ ఆర్ టి సినిమాస్ యొక్క ప్రకటన త్వరలో రానుందట. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు