‘భైరవగీత’ నుండి మరో ట్రైలర్ విడుదల కానుంది !

‘భైరవగీత’ నుండి మరో ట్రైలర్ విడుదల కానుంది !

Published on Oct 28, 2018 10:58 PM IST

Bhyravageetha

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో నూతన దర్శకుడు సిద్ధార్థ తెరకెక్కిస్తున్న చిత్రం ‘భైరవగీత’. రాయలసీమ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రేమ కథ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ , ఇర్ర మోర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ , పోస్టర్లు చిత్రం ఫై ఆసక్తిని క్రియేట్ చేయగా తాజాగా ఈచిత్రం నుండి మరో ట్రైలర్ విడుదలకానుంది. నవంబర్ 3న ఈ ట్రైలర్ ప్రేక్షకులముందుకు రానుంది. అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ , కన్నడ , మలయాళ భాషల్లో నవంబర్ 22న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు