ఇస్మార్ట్ శంకర్ నుండి మరో అప్డేట్ !

ఇస్మార్ట్ శంకర్ నుండి మరో అప్డేట్ !

Published on Jan 8, 2019 4:00 AM IST

puri ram2

ఎనర్జిటిక్ హీరో రామ్ , డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరక్కనున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. ఇంకా ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలు కాకుండానే అప్డేట్ ల మీద అప్డేట్స్ ఇస్తున్నాడు పూరి. ఇటీవల ఈ చిత్రంయొక్క టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేసి సినిమా ఫై అంచనాలు పెంచేశారు.

ఇక తాజాగా ఈచిత్రానికి సంబందించిన మరో అప్డేట్ ను వెల్లడించారు. ఈసినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించనుండగా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ రాజ్ తోట సినిమాటోగ్రఫీని అందించనున్నారు. అతి త్వరలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. పక్క యాక్షన్ ఎంటర్టైనెర్ గా తెరకెక్కనున్న ఈచిత్రాన్ని పూరి , ఛార్మి సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈచిత్రం ఈ ఏడాది మే లో విడుదలకానుంది. ఇక దాదాపుగా తన ప్రతి చిత్రానికి ఒక కొత్త హీరోయిన్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసే పూరి ఈ చిత్రానికి కూడా కొత్త హీరోయిన్ నే తీసుకోనున్నాడు.

తాజా వార్తలు