నటి అన్సీబా హాసన్ కి ‘దృశ్యం’ చిత్రాల సిరీస్‌లో మంచి పేరు వచ్చింది. మోహన్ లాల్ పెద్ద కుమార్తె అంజు జార్జ్ పాత్రలో ఆమె చాలా బాగా నటించింది. ఐతే, ఇటీవలే వ్యక్తిగత కారణాల వల్ల అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్)కు రాజీనామా ఆమె తెలిపింది. తాజాగా దీనికి గల కారణాన్ని అన్సీబా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టామ్ నాపై ‘జిహాదీ’ అనే ముద్ర వేస్తూ వేధించేవాడు. మతపరమైన వ్యాఖ్యలతోపాటు నా వ్యక్తిగత జీవితంపై రూమర్స్ వ్యాప్తి చేశారు’ అని ఆమె చెప్పుకొచ్చింది.
నటి అన్సీబా హాసన్ ఇంకా మాట్లాడుతూ.. ‘అమ్మ సంస్థలోని మరో సభ్యుడే నాకు స్వయంగా చెప్పారు. అమ్మ కమిటీలోని ఒక మహిళా సభ్యురాలు నాపై తప్పుడు ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో నేను తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాను. ఈ విషయంలో ఎలాంటి చట్టపరమైన చర్యలు చేపట్టదలుచుకోలేద’’ని అన్సీబా హాసన్ తెలిపారు. మొత్తానికి అన్సీబా చేసిన వ్యాఖ్యలు మలయాళ చిత్రసీమలో వివాదాస్పదం అవుతున్నాయి.


