
స్టార్ నటి అనుష్క ఈమధ్య సినిమాల కౌంట్ తగ్గించారు. ‘బాహుబలి 1, 2’ తర్వాత ఆమె ‘భాగమతి, నిశ్శబ్దం’ మాత్రమే చేశారు. ప్రజెంట్ కొత్త సినిమాలు వేటినీ అధికారికంగా ప్రకటించలేదు. ఆమెతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఎంతో మంది సిద్ధంగా ఉన్నా కూడ ఆమె సైన్ చెయ్యట్లేదు. మూవీ క్రియేషన్స్ నిర్మాణంలో ఒక సినిమాను ఒప్పుకున్నా ఇంకా ప్రకటించలేదు. ఆ సినిమా మొదలవ్వడానికే ఇంకొన్ని నెలలు పడుతుందట. అందుకు కారణం ఆమె బరువు తగ్గే ప్రయత్నంలో ఉండటమేనట.
‘బాహుబలి-1’ తర్వాత అనుష్క ప్రయోగం చేయాలనుకుని చేసిన చిత్రం ‘సైజ్ హీరో’. ఈ సినిమా కోసం ఆమె బాగా బరువు పెరిగారు. బరువు అయితే ఈజీగానే గెయిన్ చేశారు కానీ తగ్గించుకోవడమే కష్టమైంది. ‘బాహుబలి-2’ ముందు చాలా ట్రై చేసినా తగ్గలేకపోయారు. దీంతో రాజమౌళి విఎఫ్ఎక్స్ వాడాల్సి వచ్చింది. ఆ తర్వాత చేసిన ‘భాగమతి, నిశ్శబ్దం’ చిత్రాల్లో కూడ స్వీటీ బొద్దుగా కనిపించారు. అయితే ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు తగ్గి స్లిమ్ అవ్వాల్సిందేనని ఆమె గట్టిగ నిర్ణయించుకున్నారట. అందుకే పలు వెయిట్ లాస్ పద్దతులను పాటిస్తున్నారట. మరి ఈసారైనా ఆమె ప్రయతనాలు ఫలించి పాత అనుష్కను చూడగలమేమో చూడాలి.