టాలీవుడ్ లో టాలెంటెడ్ సింగర్ గా పేరు తెచ్చుకున్న అనుదీప్ చేసిన `శివశంకరీ` ఫ్యూజన్ కవర్ సాంగ్ లాంచ్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి చేతుల మీదుగా శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఆర్.పి.పట్నాయక్, రఘుకుంచె, జెబి, సాయికార్తిక్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ…“ సాంగ్ విజువల్స్ గానీ, అనుదీప్ ప్రజంటేషన్ గానీ అద్భుతంగా ఉంది. పెండ్యాల నాగేశ్వరావు గారి కంపోజిషన్ లో ఘంటసాల గారు ఆలపించిన ఓ గొప్ప సాంగ్ ఇది. అలాంటి గొప్ప సాంగ్ ని మోడ్రన్ గా ఫ్యూజన్ కవర్ సాంగ్ గా తీర్చిదిద్దాడు అనుదీప్. రియల్ ఫ్యూజన్ అంటే ఇది అనేలా ప్రజంటేషన్ ఉంది. ఈ సాంగ్ అనుదీప్ కు మంచి పేరు తీసుకరావాలని కోరుకుంటున్నా“ అన్నారు.
రఘుకుంచె మాట్లాడుతూ…“అనుదీప్ లో ఏదో చేయాలన్న తపన, కసి ఉంది. అదే తనను పెద్ద స్థాయిలోకి తీసుకెళ్తుంది“ అన్నారు. సాయికార్తిక్ మాట్లాడుతూ…“నాకు చాలా ఇష్టమైన పాట ఇది. ఈ పాటను ఫ్యూజన్ కవర్ చేసి సాహసం చేసిన అనుదీప్ కు ఆల్ ది బెస్ట్ తెలుపుతున్నా“ అన్నారు.


