సమీక్ష: ‘మరీచిక’ – డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ డ్రామా

సమీక్ష: ‘మరీచిక’ – డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ డ్రామా

Published on May 29, 2026 7:02 PM IST

Mareechika Review

విడుదల తేదీ : మే 29, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు : విరాజ్ అశ్విన్, రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ మరియు ఇతరులు
దర్శకత్వం : సతీష్ కాసెట్టి
నిర్మాతలు : రాజీవ్ చిలక, మేఘా చిలక్క
సంగీతం : ఇళయరాజా
ఛాయాగ్రహణం : అరవింద్ కన్నబిరాన్
ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన తాజా చిత్రాల్లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, రెజీనా ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘మరీచిక’ కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

కథ:

వెంకటలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్) ఓ కాలేజ్ స్టూడెంట్ కాగా ఆమె సంజు (విరాజ్ అశ్విన్) అనే కుర్రాడిని ఎంతగానో ఇష్టపడుతుంది. అయితే ఓ కార్పోరేటర్ కొడుకు అయినప్పటికీ సంజు సొంతంగా బ్రతకాలని బలంగా కోరుకుంటాడు. ఈ క్రమంలో వెంకటలక్ష్మి, సంజయ్ మధ్యలోకి వచ్చిన ఓ ఎన్నారై మరీచిక(రెజీనా కసాండ్రా) వల్ల ఏమైంది? ఆమె ఎందుకు సంజయ్ ని చంపాల్సి వస్తుంది? అసలు ఈ మరీచిక ఎవరు? ఎందుకు వీరి లైఫ్ లోకి వచ్చింది? చివరికి వెంకట లక్ష్మి పరిస్థితి ఏంటి అనేవి ఇందులో మిగతా కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రంలో దర్శకుడు తాలూకా విజన్ ని మాత్రం మెచ్చుకొని తీరాలి. రొటీన్ కథాంశాలతో కాకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్ ని తాను అందించే ప్రయత్నం ఇందులో హర్షణీయం. మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే సినిమా స్టైల్ లో మరీచిక ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ తో కనిపిస్తుంది. అలాగే ఇందులో ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ పార్ట్ లో కొన్ని నిమిషాలు కథనం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ముఖ్యంగా నటుడు అజయ్ ఘోష్, రెజీనా, అనుపమ పరమేశ్వరన్ లపై సాగే ఈ కొన్ని నిమిషాలు ఎంగేజ్ చేస్తాయి. అజయ్ ఘోష్ రోల్ పై వచ్చిన కామెడీ సీన్స్ ఇందులో మెప్పిస్తాయి. ఇక పెర్ఫామెన్స్ ల పరంగా చూసుకుంటే ఒక అమాయకపు అమ్మాయి పాత్రలో అనుపమ మెప్పించింది. అలాగే విరాజ్ కూడా స్క్రీన్ పై హ్యాండ్సమ్ లుక్ లో ఇంప్రెస్ చేసాడు. వీరితో పాటుగా ఓ ఎన్నారై అమ్మాయిగా కథని మలుపు తిప్పే పాత్రలో రెజీనా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి మెప్పించింది.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రంలో కోర్ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పటికీ లిమిటేషన్స్ వల్ల ఏమో స్క్రీన్ పై మాత్రం దాని పొటెన్షియల్ కి తగ్గ రేంజ్ లో అవుట్ పుట్ పడలేదు అనిపిస్తుంది. దాదాపు చాలా చిన్న సినిమాల తరహాలోనే ఇది కూడా మంచి కాన్సెప్ట్ లోనే వచ్చినప్పటికీ కథనం పరంగా మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తుంది. అలాగే ఫస్టాఫ్ చాలా స్లోగా సాగుతూ చూసే ఆడియెన్ తాలూకా సహనాన్ని పరీక్షించే విధంగా డిజైన్ చేయడం మరింత డిజప్పాయింట్ చేస్తుంది. అలా నెమ్మదిగా సాగుతూ ఒకో కనెక్షన్ వరకు అనవసర సాగదీతని మైంటైన్ చేస్తూ సెకండాఫ్ కి వస్తుంది. పోనీ సెకండాఫ్ అయినా కొంచెం ఊపందుకుంటుందా అంటే అక్కడ కూడా అదే నత్త నడక మైంటైన్ చేస్తూ వెళుతుంది. కేవలం ఆ ఒక్క ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ కొన్ని నిమిషాల కోసం ఇంతలా సాగదీయాల అనే భావన అప్పటికే చూసే ఆడియెన్ లో వచ్చేస్తుంది. అలాగే సినిమాలో చూపించిన పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా డల్ గా హ్యాండిల్ చేసినట్టు కనిపిస్తుంది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ఇంట్రెస్టింగ్ గా మాస్ట్రో ఇళయరాజ ఈ చిత్రానికి వర్క్ చేయడం విశేషం. తన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య గీతం హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే అరవింద్ కన్నబిరన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక లక్ష్మీ భూపాల దర్శకత్వం విషయానికి వస్తే.. తాను రాసిన కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, దానిని దర్శకుడు సతీష్ కాసెట్టి తెరపై అంతే ఆకట్టుకునేలా ఆవిష్కరించలేకపోయారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌లో కొన్ని సన్నివేశాలు మాత్రమే వర్కౌట్ అయ్యాయి, మిగతా భాగమంతా చాలా స్లోగా వెళుతూ డిజప్పాయింట్ చేస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘మరీచిక’ చిత్రం మంచి పొటెన్షియల్ ఉన్న కథను తెరపై ఆవిష్కరించడంలో విఫలమై డిజప్పాయింట్ చేసే సైకలాజికల్ థ్రిల్లర్‌గా మిగిలిపోయింది. ఎంగేజింగ్ గా మార్చే స్కోప్ ఉన్నప్పటికీ స్లోగా సాగే డిజైన్ చేసుకున్న కథనం నిరాశ పరుస్తుంది. రెజీనా, అనుపమ, మరియు విరాజ్ అశ్విన్ తమ నటనతో బాగానే ఆకట్టుకున్నారు. కానీ కథనంలో బలహీనత కారణంగా ఈ చిత్రం ప్రభావం చూపలేని బోరింగ్ థ్రిల్లర్ గా నిలిచిపోయింది.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

తాజా వార్తలు