మలయాళ చిత్రం ‘ప్రేమమ్’తో వెండి తెరపైకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత తెలుగు, తమిళంలోకి ప్రవేశించి మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుని ప్రస్తుతం ఎక్కువగా తెలుగు సినిమాలే చేస్తున్నారు. ఆమె చేసిన ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా ఇంకో రెండు తెలుగు సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.
ఇలా తెలుగులో మంచి స్టార్ ఇమేజ్ ఉండగానే ఈమె కన్నడలోకి కూడ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించారు. అది కూడ కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన కావడం విశేషం. రాజ్ కుమార్ చేయనున్న ‘నట సార్వభౌమ’ చిత్రంలో అనుపమ కథానాయకిగా నటించనుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాను పవన్ వడయార్ డైరెక్ట్ చేయనున్నారు.
